Reblogged from సామాన్యుడు * common man:
గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది. రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా?? ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??