తెలంగాణా అమరుడి ఇంట్లో కన్నీటి వరద… దీనికి కారణం ఎవరు ? ? ?

ఆ అమరుడి ఇంట్లో కన్నీటి వరదకు
కారణం కావాలిప్పుడు,
ఆనాడు నాయకుడు ఆవేశం లో
పెట్రోల్ మీద పోసుకున్నప్పుడు
మొరాయించిన అగ్గి పుల్లదా..
నేడు ఆకలి అవమానం కట్టలు తెంచుకున్న
విద్యార్ధి వంటిమీద నర్తించిన కిరస నాయులుదా ?
ఇగో వచ్చే అగో వచ్చే
అన్న అమాత్యుడి బొంకు మాటలదా ?
రంకు ఎన్నికల  చీటింగ్ సీట్లదా. ?
పొలిమారిన  పాలమూరుదా ?
ఇదే అదను అని
కన్నీటి వరదలు రాతలు
పెట్టుబడిగా మారిన అబద్దపు పత్రికదా.
కొవ్వెక్కి తడబడిన యాస లో
రియాలిటీ షో లు చూపిస్తున్న టీవీ డబ్బాదా
శోకిస్తున్న తల్లుల కన్నీటి వరదలు ఇంకెంత కాలం
మీకు తెలుసా ఇక్కడ దుఖం పరివ్యాప్తమయింది
చెమ్మగిల్లన కన్నీళ్ళు ఇవ్వాల నా ఇంట్లో రేపు మీ ఇంట్లో .
మృత్యువు  ఏ క్షనాన్నయినా నీ తలుపు త ట్టొచ్చు
ఈ ఆట ఆడిస్తున్న కపట నాయకుల విశ్రాంతి మందిరాలలో
సేద తీరోచ్చు వాడిల్లు ఎందుకు
నిత్యం నియాన్ ధగధగలు
ఇక్కడ చావు పెళ్లి కార్డులా
నీకు తెలియ కుండానే
రావొచ్చు ..
అగో అక్కడ చూడు
కమురు వాసన కమ్మేస్తోంది
కాపరి మరో దహనానికి
సిద్దం అవుతున్నాడు
తెగిన మంగళ సూత్రాలు
వాడ వాడనా ఎక్కిరిస్తున్నాయి..
ఊరిచివరి గుడిసె నిట్టాడికి మరో శవం
తన తాడును తానే పురి పేను కుంటోంది
దింపుడు గల్లం మరో క్రతువు
కోసం చూస్తోంది
వ్యధ తెలియని వార్తా హరుడు
మరో కదనానినికి సిద్ధం అవుతున్నాడు
నిజమే.ఇల్లు ఏడుస్తోంది

Leave a Comment

Filed under కవిత్వం

పాలమూరు – ద్రౌపది -.. ఎవరు గెలిచారు ?

ఆదునిక బర్బరీకుడు పాలమూరు అభ్యర్ది..

మహబూబ్ నగర్ లో ముస్లింలు (తెరాస అభ్యర్ది ) గెలిస్తే రజాకార్లను గెలిపించినట్టే : కిషన్ రెడ్డి _ నరేంద్ర , జిట్టా, దత్తాత్రేయ;

తెలంగాణా వాదాన్ని గెలిపించండి ? ? ? ? : కోదండ రాం రెడ్డి TS జాక్ చైర్మన్

ఎన్నం శ్రీనివాస రెడ్డి నే గెలిపించండి :   మహబూబనగర్ జిల్లా జాక్

ఎన్నం   శ్రీనివాస   రెడ్డి నే  గెలి పించండి : తెలంగాణా N R I – U K & USA  సంగాలు

ఈ ఎన్నికలు ‘హిందు ధర్మానికి’_ ‘ముస్లిం అధర్మానికి ‘ మధ్యన జరిగేవి

కాబట్టి ధర్మాన్ని గెలిపించండి : మనువాదులు

మహబూబ్నగర్ లో తెరాస విజయం ఎప్పుడో ఖాయం అయింది ? ? ? ? దావత్ కు సిద్దం కాండి :కెసిఆర్ ఎన్నికలకు ముందు ప్రకటన   ( ఎవరి గెలుపు ? )

మనువాద బాజాపాను ఓడించండి : O U జాక్ నేత పిడమర్తి ( దానికి జాక్ నుండి TRS అగ్ర నాయకత్యం నుండి ఫోన్ మంతనాలు అలా కుదరదు అని బెదిరింపు )

ఎన్నిక ల ( యుద్ధం ) తర్వాత :

పాలమూరు లో తెలంగాణా వాదం ఓడిపోలేదు

అక్కడ మనమే (అగ్ర కుల నాయకత్వ్యం ) గెలిచాం…: కెసిఆర్: ఫలితాల వెల్లడి తర్వాత

చివరిగా తేలింది ఏమిటంటే పాలమూరులో ముస్లిం అభ్యర్థి గెలిస్తే రజాకార్ల రాజ్యం వస్తది

కాబట్టి అక్కడ ధర్మం( బాజాపా) గెలి చింది లేకుంటే గెలిపించ బడ్డది

పాండవుల ఉమ్మడి సతి  ద్రౌపది

జూదం లో ఒడి పోయిన తర్వాత
ఒరే..మీరు ఒడి నన్ను జూదం లో పెట్టారా లేకుంటే
కావాలనే నన్ను మీ తమ్ముళ్ళకు
అప్పగించడానికి
మీరే ఒడారా అని అడిగింది

గెలుపు ఓటమి ల తత్వ్యం గూర్చి తెలియాలంటే

ద్రౌపది మనసును చదవాలి
ఇక్కడ నేడు జరిగిన ఉప ఎన్నికలో

గెలుపు ఓటములు తెలియాలంటే మనువాదాన్ని చదవాలి…

అంతే అభినవ భారత యుద్దాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి..

తెలంగాణా కురుక్షేత్ర యుద్ధం ఇంకా

భీష్ముడి చావులాగా అంపశయ్య మీద పకుకొని ఉంది.

కురుక్షేత్ర  యుద్ధం లో కోట్ల మంది చనిపోయారు…
ఇక్కడ కేవలం 1000 అమాయక దళిత బహుజనులు….
ఒకటి అర బీద పెద్ద కులపోల్ల పిల్లలూ చని పోయారు….

ఈ యుద్ధం ఎప్పుడూ రగులుతూనే ఉండాలి
కురుక్షేత్ర  యుద్ధం తర్వాత
భూ న బస్సులు పగిలాయి
కురు యుద్ధం లో నేల నింగి కె గసింది
సంగ్రామం ముగిసింది
అన్న దమ్ముల మధ్య అధికారం చేతులు మారింది
చివరకు కృష్ణుడి చావుతో

బారతం సమాప్తం దాని కి చాలా సమయం ఉంది
ఈ యుద్ధం లో ఇబ్రహీం అనే బర్బరీకుడు
బలి అయిపోయాడు..

ఇక్కడ కెసిఆర్  ఓడి అబ్రహాం ను జూదం లో
పెట్టాడా అని ఆదునిక ద్రౌపది అడగలేదు
ఎందుకంటె
ఈ యుద్దం ముందే ఆది- అంతం నిర్ణ యించి
మొదలయింది
గెలుపు ఓటమి
ఇక్కడ పాండవుల కు కౌరవులకు
ముందే తెలుసు
యుద్ధం మిధ్య
నిజమయిన యుద్ధం
మొదలు కావాల్సి ఉంది

Leave a Comment

Filed under నడుస్తున్నచరిత్ర

నా ఇఫ్లూ నాకెప్పుడూ గొ డ్రాలే….

ఈ క్రిందున్న ఫోటోలో ఉన్న తమ్ముడు Dr .ముత్యం నాతొ బాటు ఇఫ్లూ లో డాక్టోరల్ ఫెలో గా ఒకే సారి చేరాము ,”అభయ్ మౌర్య” అనే ఓ పనికి మాలిన కుహనా కమ్మ్యునిస్టు
vice chancellor నిర్వాకం వల్ల ఓ మొదటి తరం దళిత పరి శోదకున్ని కోల్పోయింది లోకం.
 తమ్ముని పిచ్చి అమ్మ ఆయ్య లు ఇస్తానన్న కొలువు కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాలికి బలపం కట్టుకొని తిర్గు తున్నారు .
సంస్కరించడానికి కొందరు విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే
మరి కొందరు sponsored ఉద్యమాలు చేస్తున్నారు,
ఇక్కడ జరిగిన పాపాల లో ఎవరి వంతు ఎంతో తేల్చే పనిలో సిబిఐ ఉంది ,
దాని నుండి ఎలా బయట పాడాలా అని కొందరు ,
మరికొందరు తన కులపోల్లకు కొల్వు లు ఇప్పిచ్చి
వికట్ట హాసం తో విర్ర వీగుతున్నారు.
 తమ్ముడు చని పోయి ౩ ఏళ్ళు దాటింది
 నష్ట పరిహారంగా  ఇస్తా నన్న కొలువు కోసం
అనామకుల్లగా అవ్వ . అయ్య ..
.త్వరలో తమ్ముని 3 వ వర్దంతి
ఆలోగా నయినా ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్దా..? జరగాలని
 ముత్యం ..

నీ చావుకు ..కారణం ఎవరు ?
పరిహారం కోసం
ఇచ్చిన హామీ
నీ మీద పెట్టిన ఐస్ గడ్డ కరిగినంత
సేపు కూడా నిలబడలే
ఇప్పుడు న్వ్వులేవు
ఇక్కడ ..తెల్లార్లూ విస్కీ కంపు
గప్పు మంటోంది
నియాన్ బలుబుల
వెలుతురులో మగత గా
కామం కైపెక్కుతోంది

గంజాయి గుట్కా  మత్తులో

హుక్కా పొగల ఆవిర్ల తో
 కళ్ళు  కైమోడ్పు లవుతున్నాయి
రాత్రయితే ఇఫ్లూ నాకు
వార చూపులతో చూసే
నెరజాన లాగ అగుపిస్త ది
తిరగిన చోటే మళ్ళీ మళ్ళీ
గిడు గిడు గుంచం లాగా
తిరుగుతూ ….
ఎక్కడ చూసిన
విసిరి పారేసిన
కాళీ సీసాలు
వాడేసిన కండో మ్ లు
అర్థ భావ ప్రాప్తులతో
కొట్టు మిట్టాడుతూ
నా ఇఫ్లూ
నాకెప్పుడూ
గొ డ్రాలే……….

3 Comments

Filed under కవిత్వం

EFLU students, who had represented EFLU in various international forums to present their research papers

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2833396.ece

Leave a Comment

Filed under నడుస్తున్నచరిత్ర

The Hindu : NATIONAL / ANDHRA PRADESH : ‘Critical Editions’ of 14 books launched at EFLU

The Hindu : NATIONAL / ANDHRA PRADESH : ‘Critical Editions’ of 14 books launched at EFLU.

Leave a Comment

Filed under నడుస్తున్నచరిత్ర

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 2,700 times in 2011. If it were a cable car, it would take about 45 trips to carry that many people.

Click here to see the complete report.

Leave a Comment

Filed under 1

మరాండీ శిక్ష చేస్తున్న హెచ్చరిక!

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంవూదంలో ‘ఉరిశిక్షల రద్దు పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ చాలా ఉత్తేజకరంగా జరిగింది. వర్షంలో ఎవరు వస్తారులే అనుకుంటూ సమావేశానికి బయలుదేరాను. జోరున వర్షం కురుస్తున్నా సభ జరుగుతున్న హాల్ కిక్కిరిసిపోయింది. ఎందుకో రాజ్యం ఇంత కసాయిగా ఉన్నా ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ .. ఆ సమావేశానికి వచ్చి న సంఖ్య చూస్తే చాలా ఆశ కలిగింది. దాదాపు నాలుగు ఏళ్ల కింద ట జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబులాల్ మరాం డి కుమారుడి మీద జరిగిన దాడిలో అతని కొడుకుతో పాటు మరి కొంతమంది మరణించారనే అభియోగంతో, ఆ దాడిలో పాల్గొన్నారని ఛత్రపతిమండల్, మనోజ్ రజ్వార్, అనిల్ రాం, జీతన్ మరాండీలకు ఉరి శిక్ష పడింది. దీనికి నిరసనగా జరిగిన సభకు వరవరరావు, గద్దర్, బీడీ శర్మ, విప్లవ కవి శివాడ్డి, జీతన్ మరాండీ సహచరి అపర్ణా మరాండీ, విస్తాపన విరోధ్ మంచ్ ప్రతినిధి వినోద్ తదితరులు హాజరయ్యారు. హాల్ అంతా నిండిపోయింది.

ఈ మధ్య అంత పెద్దసంఖ్యలో అందునా జోరున వర్షం కురుస్తున్నా హాజరవడం బహుశా ఇదే మొదటిసారేమో. లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది, లోపల చోటులేక బయ నిలబడ్డారు. కూర్చోవడానికి సీట్ వెతుక్కోవడానికి చాలా కష్టపడ్డాను. తన ఏడాది కొడుకునెత్తుకొని కళ్లలో అంతులేని ఆశతో భవిష్యత్తుమీద అచంచలమైన భరోసాతో శత్రువుమీద దూకడానికి సిద్ధంగా ఉన్న సివంగి లా అపర్ణా మరాండి కనిపించింది. నా సీట్ పక్కనే తన కొడుకుని ఎత్తుకొని ఒళ్లో పెట్టుకొని అమాయకంగా కూర్చొంది. మన నిర్వాహకుల తెలుగు ప్రసంగాలు అర్థంగాక నన్ను పిలిచారా లేదా అనే ఆమె తొట్రుపాటు గమనించాను. చాలా సాదా సీదాగా, ఎముకల గూడులా ఉన్న ఆమెను చూస్తే అంత గొప్ప కళాకారిణిగా అనిపించదు. ఆమె మీద నాకు గౌరవం పెరిగింది.

అదే సందర్భంలో.. పాట అంగట్లో అమ్మకపు సరుకై, ఎలక్షిక్టానిక్ మీడి యా యజమానుల దగ్గర ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్న కొంతమందిని చూస్తేజాలి వేసింది. జీతన్ మరాండీ ఈరోజు ఎందుకు ఉరికంబానికి ఎక్కుతున్నాడు?ఎందుకంటే.. ప్రజల నోటికాడి కూడు, నీడ దోచుకుంటున్న దోపి డీ శక్తుల గుట్టు బయట పెట్టినందుకే అపర్ణా మరాండీ సహచరుడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చిం ది. ఎప్పటి నుంచి ఈ పరంపర మొదలయ్యిం ది? వాళ్లు లాహోర్ కుట్రకేసులో పాల్గొన్న వాళ్లు కావచ్చు. అంతర్జాతీయ ఆయిల్ మాఫియా ‘షెల్’ కంపె నీ దురాగతాలకు ఉరికంబమెక్కిన కేంసారో వివా కావచ్చు. అమెరికన్ సామ్రాజ్యవాదులు బలిగొన్న సక్కో వాంజెట్టీ కావచ్చు. తెలంగాణ జైత్రయాత్ర భూమిపువూతులు భూమ య్య, కిష్టాగౌడ్ కావచ్చు. నేడు నేను కావ చ్చు. రేపు మీరూ కావచ్చు. ఇలా రాజ్యహింసలో ఎందరో బలయిపో యారు.

ఇంకా ఎంతకాలం ఈ మానవ హననాలు? ఈ ప్రశ్నలు ముప్పిరిగా నా మనసులో తొలుస్తున్నాయ్. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన కసాయి తనం ఆమె కళ్లల్లో కన్పించింది. ఆమె చేతుల్లో ఉన్న ఏడాది వయసు బిడ్డను ఎత్తుకొని వాణ్ణి నిద్రపుచ్చుతూ తోటి కళాకారుల గజ్జెల సవ్వడి చూసి ఊగిపోయింది. తనూ, తన సహచరుడు ఆ గజ్జెలతో ఎన్ని వందల ఊళ్లను మేల్కొలిపి ఉంటా రు? ఇంకొన్ని రోజుల్లో తన కొడుకు తండ్రి లేని అనాథ అయినా తన కొడుకులా మరే కొడు కూ నీడలేని వాడు కావద్దని దేశమంతా సంచారిలా తిరుగుతోం ది. అందరినీ సంఘటితం చేసే పనిలో ఉందామె. రాజ్యం కత్తుల వంతెన మీద సవారి చేస్తున్న ఆమెను చూస్తే ఆపాటి త్యాగంలో ఒక పైసా వంతు అయినా ఈ దేశ మేధో వికాసవంతులు చేస్తున్నారా? అనిపించింది. ప్రశ్నించే వాళ్లను అభివృద్ధి నిరోధకులని లక్షల రూపాయలు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వాళ్లు, బహుళజాతి కంపెనీల మోచేతి నీళ్లు తాగే ఎన్‌జీఓలు పిల్లి కూతలు కూస్తున్నారు. ఆమె ప్రసంగాన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న కుహ నా మేధావులతో గోడ కుర్చీ వేయించి వినిపించాలని పించింది. ‘అంతర్జాతీయ విపణిలో భారతమాత అంగాంగం తాకట్టు పెట్టబడుతోంది’ అని ప్రజాకవి చెరబండ రాజు చెప్పిన విషయాన్ని అపర్ణ మరాండీ అంటూంటే.. గర్వపడ్డాను. జాతీయ, అంతర్జాతీయ దోపిడీ దారులు వందల ఏళ్లుగా సమస్త వనరులను దోచుకున్నారు.

నేడు వాళ్ల దృష్టి భూమి అడుగున ఉన్న విలువైన బాకె్సైట్ మీద పడ్డది. దానికి అక్కడ ఉన్న ఆదివాసులు అడ్డుగా ఉన్నారని వాళ్లను భౌతికంగా నిర్మూలించడానికి సిద్ధమయ్యారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ గిరిజనులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మానవరహిత విమానాలతో యుద్ధసన్నాహాలు చేస్తున్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ‘విస్తాపన్ విరోధి మంచ్’, జీతన్ మరాండీ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అభేన్ సాంస్కృతిక సంస్థ’ నుంచి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలను దుయ్యబట్టారు. చూస్తే అమాయకంగా కనిపించిన అపర్ణా మరాండీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి దారులు జల్, జమీన్, జంగిల్ మీద ఆదివాసీలకు కనీసం హక్కులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజాల తవ్వకం కోసం ఆదివాసులను అక్కడినుంచి తరిమేసే పనిలో ఉన్నారని, దాన్ని ప్రశ్నించిన వాళ్లను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్జె కట్టి పాటపాడే ఆదివాసుల మీద , వాళ్ల కలాల మీద, గళాల మీద ఆంక్షలు ఆక్షేపణీయమని అన్నారు. జిందాల్, మిట్టల్, అభిజిత్ లాంటి సంస్థ లు మైనింగ్ మాఫియా అవతారమెత్తి లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితుల్ని చేస్తున్నాయని అపర్ణా మరాండీ తెలిపారు.

ఈ క్రమంలో వందలాదిమంది చనిపోయారని, ఎంతో మంది కనిపించకుండాపోయారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన కళాకారుల కు ఉరిశిక్షలు వేస్తున్నారని, ఇవాళ తన సహచరుడు జీతన్ మరాండీ కూడా ఆ కుట్రకు బలయ్యారని తెలిపారు. ఇది వ్యక్తిగతంగా జీతన్ మరాండీ మీద పెట్టిన కేసు, వేసిన ఉరి శిక్షగా అనుకోవడం లేదనీ, ఇది ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి మైనింగ్ మాఫియా చేసిన దాడిగా చూడాలని పిలుపునిచ్చారు. వందల ఏళ్లుగా ఆదివాసులు అటవీ సంపద హక్కు భుక్తంగా చేసుకొని బతుకుతున్నారు. నేడు వాళ్ల ఉనికికే ప్రమాదం వచ్చిందని అన్నారు. ఇవ్వాళ దేశంలోని బుద్ధిజీవులంతా.. మైనింగ్ మాఫియా, బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రశ్నించి ఎదిరించకుంటే.. అందరికీ ఉరితాడే మిగులుతుందని హెచ్చరించారు. ఇవ్వాళ భారత ప్రభుత్వానికి ఈ నేల వాసుల ప్రయోజనా ల కన్నా మైనింగ్ మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని దానికి వ్యతిరేకం గా దేశంలోని ప్రజాస్వామికవాదు లు, మేధావులు సంఘటితంగా ఐక్య ఉద్యమాలు తీవ్రతరం చేయాలని అపర్ణా మరాండీ కోరారు. ఉరి శిక్షల రద్దు కోసం జాతీయంగా, అంతర్జాతీయం గా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అమానవీయమని అంటున్నా.. మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శించారు.

నేడు దేశం లో వందలమంది ఈ ప్రాంత విమిక్తి కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు ఆ  క్రమం లో శత్రు నిర్భందాలకు  గురి అవుతున్నారు , అది మొన్న శ్రీకాకుళం కావచ్చు  నేడు  , బస్తర్ , నల్లమల , నందిగ్రాం , జంగల్ మహల్ ,  దంతే వాడ  కావచ్చు  జనతన సర్కార్ కావచ్చు తాము  ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు  తమను ప్రాజెక్టుల పేరుతొ అభివృద్ధి  పేరుతొ  సమస్త సంపదను  దోచుకొనే క్రమంలో ఇనుము తో  నీళ్ళతో, అటవీ సంపదతో  రాజకీయాలుచేసి వాళ్ళను ముంచే పని లో  భూమి లోపల దాగి ఉన్న  లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ సంపదను  దోచుకొనే పనిలో ఉన్నారు ఇది అన్యాయమని  ప్రశ్నించిన  మరాండీ లాంటి మిత్రుల ప్రాణాలు హరించే పనిలో ఉన్నారు నేడు అంతర్జాతీయ  పెట్టుబడీ దారుల  ప్రయోజనాలే  లక్ష్యం గా  దోపిడీ కి దారులు  పరుస్తున్నారు . ఈ సహస్రాబ్ది  చివరి అంకంలో     నేడు జీతెన్ మరాండి అనే ఒక యోధుడు పుట్టినా పుట్టకున్నా మరణించినా  మరణించ క పోయినా , ఈ కాలంలో ఇప్పటికంటే మెరు గయిన సమాజాన్ని  కల గనే క్రమంలో  మొదట వరసలో ఉంటాడు ఎదుకంటే అతను అందరిలా బ్రతకాలను కోలేదు ఇక్కడ దోపిడీ పీడన లేని సమాజంలో  అపర్ణా మరాండి తన కొడుకు లాంటి వందలాది మంది వాళ్లకు మెరుగయిన పరిస్తుతులు కల్పించాలనుకున్నాడు  అందుకే కాలుకు బలపం కట్టుకొని అడివంతా తిరిగాడు అటవీ సంపదను కపాడాలనుకున్నాడు ఆ క్రమంలో కుటుంబానికి దూరం అయినాడు.  అతని పైన రాజ్యం కన్నెర్ర చేసింది . అగో అందుకే తన సహచరుల లాంటి వందలాది మంది ని కాపాడుకోవాలని పిలుపు నిస్తోంది .అప్రనా మరాండి . బ్రిటీష్ వాడి కలం లో వచ్చిన ఇలాంటి నల్ల చటాలకు  వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు

ఇలా అనాగారీకమయిన  మధ్య యుగాల కాలం లో అమలు పరచిన అమానవీయ ఉరి చట్టాలనుమ నేడు  ప్రపంచ వ్యాప్తంగా రద్దు చేసిన వైనాన్ని గుర్తు చేసారు  ఆ క్రమంలో  తమిళనాడులో రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయడం ఆహ్వానించదగిందని అన్నారు. మరి మనమిక్కడ ఏం చేస్తున్నాం. ‘సామాన్యుల్ని శవాలుగామార్చి, పోలీసులు మిలిటరీ సాయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జులుం, జబర్ దస్తీలే న్యాయం, ధర్మం అని బుకాయించి, దబాయించి అధికారం చెలాయిస్తుంటే మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థులు అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేక భయానికి తలొంచుకుంటున్నారా?’ అని రావిశాస్త్రి ఎప్పుడో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితుల్లో అన్నారు. సరిగ్గా ఇవ్వాళ తెలంగాణలో ప్రతిరోజూ పరిస్థితి ఎమ్జన్సీని తలపిస్తోంది. నేడు తెలంగాణ కూడా అంతరంగిక భద్రతా చట్టంలోకి మారిపోనుందా..? ఏమో??

-గుర్రం సీతారాములు
రీసెర్చ్ స్కాలర్

Leave a Comment

Filed under నడుస్తున్నచరిత్ర